3. Live Caption: మీ ఫోన్లో ప్లే అవుతున్న వీడియోకు క్యాప్షన్ కావాలనుకుంటే లైవ్ క్యాప్షన్ ఫీచర్ యాక్టివేట్ చేయొచ్చు. వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆటోమెటిక్‌గా క్యాప్షన్ జనరేట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. యూట్యూబ్ వీడియో, పాడ్ క్యాస్ట్, వీడియో కాల్, వాయిస్ మెసేజ్... దేనికైనా లైవ్ క్యాప్షన్ ఫీచర్ పనిచేస్తుంది.
4. Smarter replies: స్మార్ట్ రిప్లై ఫీచర్‌ను గతంలోనే మెసేజింగ్ యాప్‌లో అందించింది గూగుల్. ఇప్పుడు ఏ మెసేజింగ్ యాప్ అయినా స్మార్ట్ రిప్లై ఫీచర్ పనిచేస్తుంది. మీకు వచ్చిన మెసేజ్ కంటెంట్‌ను అర్థం చేసుకొని అందుకు కావాల్సిన రిప్లైని సూచిస్తుంది గూగుల్. ఉదాహరణకు మీకు మెసేజ్‌లో ఎవరైనా అడ్రస్ పంపిస్తే... డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్‌లో మీకు ఆ అడ్రస్ కనిపిస్తుంది.
6. Privacy and location permissions: ప్రైవసీ గురించి ఆలోచించేవారికి ఆండ్రాయిడ్ 10 అద్భుతమైన ఫీచర్లు అందించబోతోంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌లో ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో 50 పైగా మార్పుచేర్పులు, ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది గూగుల్. లొకేషన్ డేటా, పర్మిషన్స్ విషయంలో యూజర్లకు అదనంగా కంట్రోల్ రాబోతోంది.