2. ఈ యాప్ ద్వారా ఎక్కువగా భార్యలపై భర్తల దాడులు, అసభ్యకర చేష్టలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇప్పటికే ఆరు మహిళా పోలీస్ స్టేషన్లను దిశ పోలీస్ స్టేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మరో 12 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నట్టు డీజీపీ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. 'దిశ ఎస్ఓఎస్' యాప్ ఫిబ్రవరి 9న గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటిసారి డౌన్లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ వ్యక్తిగత సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వివరాలు అప్డేట్ చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. యాప్ ఓపెన్ చేయగానే SOS బటన్‌తో పాటు నేరుగా 100 లేదా 112 నెంబర్‌కు కాల్ చేసేందుకు బటన్ ఉంటుంది. 100 నెంబర్‌కు నేరుగా కాల్ చేయొచ్చు. 112 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఇక యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. మీరు క్యాబ్‌లో, ఆటోలో వెళ్తున్నప్పుడు మీ గమ్యస్థానాన్ని అందులో ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)