గతంలో కంపెనీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంఖ్య కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అమెజాన్ అనేక ప్రాంతాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు, టెక్నాలజీ స్టాఫ్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో ఈ లేఆఫ్స్ ఉంటాయని, కొన్ని సోర్సెస్ ద్వారా కంప్యూటర్ వరల్డ్‌కి తెలిసింది.
నవంబర్‌లో 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోందని కొన్ని అంతర్గత వర్గాలు న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపాయి. ఇప్పుడు తొలగించే ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, సీనియర్ మోస్ట్ స్థానాల్లో ఉన్న వారి సహా అన్ని స్థాయిలలోని వ్యక్తులను తొలగించాలని అమెజాన్ యోచిస్తోందని తాజా నివేదిక పేర్కొంది. అమెజాన్ దాదాపు 20,000 మంది తొలగింపు ప్రక్రియను ప్రారంభించే విధంగా, ఉద్యోగుల పని పనితీరును అంచనా వేయమని కంపెనీ నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
వర్క్‌ఫోర్స్‌లో 1.3 శాతంపై వేటు
ఇ-కామర్స్ దిగ్గజం 6 శాతం కార్పొరేట్ సిబ్బందిని, అమెజాన్ 1.5 మిలియన్ల వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 1.3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, గంటలవారీగా పనిచేసే వర్కర్స్ కూడా ఉన్నారు. ప్రభావిత ఉద్యోగులకు 24 గంటల నోటీసుతో పాటు వేతనం కూడా అందజేస్తారని, కార్పొరేట్ సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారని సోర్సెస్ పేర్కొంటున్నాయి. వార్తలు బయటకు రావడంతో కంపెనీలోని ఉద్యోగులలో ఆందోళన నెలకొందని కొందరు కంప్యూటర్ వరల్డ్‌కి తెలిపారు. ఏ విభాగంలో తొలగింపులు ఉంటాయనే స్పష్టత, సమాచారం లేదని అన్ని విభాగాల్లోనూ తొలగింపులకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. కరోనా సమయంలో అధిక నియమాలు, కంపెనీ ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్న కారణాలతో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని సోర్సెస్ తెలిపాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ముందస్తుగా తెలియజేస్తాం: సీఈవో
అంతకు ముందు అమెజాన్ సీఈవో ఓ ప్రకటనలో.. తొలగింపు ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని, కంపెనీ ప్రతిదీ అంచనా వేసిన తర్వాత సంబంధిత ఉద్యోగులకు తెలియజేస్తుందని ప్రకటించారు. కాబట్టి ఖర్చును ఆదా చేసేందుకు అన్ని ప్రాంతాల్లోని అన్ని విభాగాలను సమీక్షించి ఉంటారని, అందుకే తొలగింపుల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మా వార్షిక ప్రణాళిక ప్రక్రియ కొత్త సంవత్సరం వరకు విస్తరించి ఉంటుందని, లీడ్స్ అడ్జస్ట్మెంట్లను చేస్తూనే ఉన్నారని, మరింత మంది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని ఆండీ అన్నారు. ఆ నిర్ణయాలను 2023 ప్రారంభంలో సంబంధిత ఉద్యోగులు, సంస్థలతో పంచుకొంటామని చెప్పారు. ఎంత మందిని తొలగించే అవకాశం ఉందనే అంశాలపై ఇంకా ఓ స్పష్టతకు రాలేదన్నారు. కానీ ప్రతి ఉద్యోగికి ముందస్తుగా సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.