Redmi 10 Power స్మార్ట్ ఫోన్ HD + రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. దీని డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ఇవ్వబడింది. మరియు ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్లో సింగిల్ స్పీకర్ సెటప్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13తో పని చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంది. దీనితో పాటు మీరు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ని కూడా పొందుతారు. ఈ ఫోన్ వెనుకవైపున ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సెల్ఫీ కోసం ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)