మీరు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ ను మళ్లీ ప్రారంభించింది. ఈ సేల్ జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో వినియోగదారులు తమ పాత ఫోన్‌ను 40 శాతం వరకు తగ్గింపుతో సులభంగా నెలవారీ వాయిదాలలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే, మీ ఆర్డర్‌పై మీకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక్కడ రూ. 23 వేల లోపు ధరతో లభించే ఐదు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..(ప్రతీకాత్మక చిత్రం)
Redmi Note 10 Pro Max: రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ బేస్ 6 జిబి ర్యామ్ + 128 జిబి మోడల్ ఈ సేల్ లో రూ .19,999 నుంచి లభిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు క్వాడ్ రియర్ కెమెరాలతో 6.67-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో లభిస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో 108 మెగాపిక్సెల్ షూటర్ ఉండగా, 5,020 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ కస్టమర్లు రూ .11,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 750 తగ్గింపు లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Oppo F19: ఈ ఫోన్ 6.43-అంగుళాల పూర్తి హెచ్డి + ఆల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రాథమిక కెమెరా ఉంది. 6GB + 128GB వేరియంట్ ధరను రూ .18,990 గా నిర్ణయించబడింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డులు కలిగిన వినియోగదారులు రూ .2,250 తగ్గింపును పొందవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
iQOO Z3 5G: ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768G SoC మరియు మూడు స్టోరేజ్ మోడళ్లతో లభిస్తుంది. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. అమెజాన్‌లో బేస్ 6 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .19,990 ధరకు రిటైల్ అవుతోంది. వినియోగదారులకు ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Xiaomi Mi 10i: షియోమి ఎంట్రీ లెవల్ మిడ్-బడ్జెట్ ఫోన్ మి 10 ఐ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 జి ప్రాసెసర్‌తో లభిస్తుంది. ఇది 120Hz 6.67-అంగుళాల ఫుల్-HD + డిస్ప్లేని కలిగి ఉంది. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ లో వినియోగదారులు ఈ ఫోన్ ను రూ. 21,999 నుంచి ఇన్స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐ ఆప్షన్స్ తో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 1,500 రూపాయల తగ్గింపు లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)