1. అమెజాన్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ (Amazon Smartphone Upgrade Days Sale) ప్రారంభమైంది. వన్‌ప్లస్, సాంసంగ్, రెడ్మీ, రియల్మీ లాంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.20,999 విలువైన సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ (Samsung Galaxy M32 5G) స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,000 లోపే సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో రూ.5,000 పైనే డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.15,749 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Amazon India)
3. బ్యాంక్ ఆఫర్, అమెజాన్ కూపన్ ఆఫర్ కలిపి రూ.5,250 డిస్కౌంట్ లభిస్తోంది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొంటే రూ.1,250 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. (image: Samsung India)
4. ఎక్స్ఛేంజ్ ద్వారా సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.16,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఎక్కువ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ లభిస్తే మీరు అంత తక్కువకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: Samsung India)