1. త్వరలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon Prime Subscription) ధరలు పెరుగుతున్నాయన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏకంగా 50 శాతం ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ (Annual Subscription) తీసుకోవాలంటే రూ.999 చెల్లిస్తే చాలు. త్వరలో ఇదే మెంబర్‌షిప్‌కు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. (image: Amazon India)
3. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయన్న స్పష్టత లేదు. కానీ త్వరలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి వారి వేలిడిటీ పూర్తయ్యేవరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత పెరిగిన ధరల ప్రకారం రెన్యువల్ చేయాలి. (image: Amazon India)
8. అమెజాన్ షాపింగ్ యాప్‌లో ప్రైమ్ కస్టమర్లకు ఎక్స్‌క్లూజీవ్ డీల్స్ ఉంటాయి. సేల్ సమయంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే ఆఫర్స్ పొందొచ్చు. ఆర్డర్ ధరతో సంబంధం లేకుండా ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఉచితంగా ఇన్ గేమ్ కంటెంట్ సేవలు కూడా లభిస్తాయి. ఇక వందలాది ఇబుక్స్ ఉచితంగా చదవొచ్చు. (image: Amazon India)