1. అమెజాన్ ప్రైమ్... ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ అందిస్తున్న ప్రీమియం సర్వీస్ ఇది. ఈ ప్రీమియం సేవల ధరలు మరింత కాస్ట్లీ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon Prime Subscription) ధరలు భారీగా పెరగబోతున్నాయి. ప్రైమ్ మెంబర్షిప్ (Prime Membership) ధరలు ఏకంగా 50 శాతం పెరగనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. (image: Amazon India)
2. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి. అంటే డిసెంబర్ 13 అర్ధరాత్రి వరకు ప్రస్తుతం ఉన్న ధరకే సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఆ తర్వాత మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం పెరిగిన ధరల ప్రకారమే చెల్లించాలి. ఇక రెన్యువల్ చేసేవారు కూడా డిసెంబర్ 13 లోపు చేస్తే పాత ధరలే వర్తిస్తాయి. (image: Amazon India)
3. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నవారు డిసెంబర్ 14 తర్వాత రెన్యువల్ చేయించాల్సి ఉంటే కొత్త ధరల్ని చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ధరలు ఏకంగా 50 శాతం పెరగడం యూజర్లకు భారమే. అయితే మెంబర్స్‌కు వ్యాల్యూ పెంచేందుకు, ప్రైమ్ సేవల్ని మరింత విలువైనవిగా మార్చేందుకు మెంబర్షిప్ ధరల్ని పెంచుతున్నట్టు అమెజాన్ గతంలోనే ప్రకటించింది. (image: Amazon India)
4. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వివరాలు చూస్తే ప్రస్తుతం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ధర రూ.999. డిసెంబర్ 14 నుంచి రూ.1,499 చెల్లించాలి. యాన్యువల్ మెంబర్షిప్ ఏకంగా రూ.500 పెరిగింది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మంత్లీ, క్వార్టర్లీ మెంబర్షిప్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మంత్లీ ప్లాన్ ధర రూ.129 కాగా డిసెంబర్ 14 నుంచి రూ.179 చెల్లించాలి. మంత్లీ ప్లాన్‌పై రూ.50 పెరిగింది. (image: Amazon India)
5. ఇక క్వార్టర్లీ ప్లాన్ ధర ప్రస్తుతం రూ.329 ఉంటే డిసెంబర్ 14 నుంచి రూ.459 చెల్లించాలి. క్వార్టర్లీ ప్లాన్‌పై రూ.130 పెరిగింది. ప్రైమ్ మెంబర్షిప్ ధరల్ని పెంచబోతున్నట్టు అమెజాన్ ఇండియా అక్టోబర్‌లోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ప్రకటించింది. కానీ అప్పుడు తేదీలను ప్రకటించలేదు. డిసెంబర్ 14 నుంచి ధరలు పెరగబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతలోపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కోరుతోంది. (image: Amazon India)
6. ఇక 18 నుంచి 24 ఏళ్లలోపు వారికి యూత్ ఆఫర్లో భాగంగా రూ.499 ధరకే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది అమెజాన్. అయితే యువతకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధర ఇంతే ఉంటుందా, పెరుగుతుందా అన్న స్పష్టత లేదు. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్లలోపు వారు రూ.999 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. వారికి రూ.500 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ వస్తుంది. (image: Amazon India)
7. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ చూస్తే అమెజాన్‌లో ప్రతీ ఆర్డర్‌పై ఫ్రీ డెలివరీ పొందొచ్చు. మినిమమ్ ఆర్డర్ నిబంధనలేవీ ఉండవు. ప్రైమ్ ఎక్స్‌క్లూజీవ్ డీల్స్ కూడా పొందొచ్చు. ప్రైమ్ వీడియో ద్వారా లేటెస్ట్ సినిమాలతో పాటు అమెజాన్ రూపొందించే ప్రైమ్ ఒరిజినల్స్ చూడొచ్చు. ప్రైమ్ మ్యూజిక్ ద్వారా లక్షలాది పాటల్ని యాడ్స్ లేకుండా వినొచ్చు. 10 మిలియన్ పైగా పాడ్‌క్యాస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. (image: Amazon India)