ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఇటీవల ప్రైమ్ డే సేల్ ను ప్రకటించిన విషయం తెలిపిందే. ఈ సేల్ 26న ప్రారంభం కానుండగా.. 27 వరకు కొనసాగనుంది.ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్రుహోపకరణాలు, ఇతర వస్తువలుపై భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే ఈ సేల్ లో రూ. 25 వేల కన్నా తక్కువ ధరకు Oppo, Xiaomi, Samsung తదితర కంపెనీల నుంచి మంచి స్పెసిఫికేషన్లు కలిగిన ఫోన్లను ఆఫర్లపై సొంతం చేసుకోవచ్చు. అయితే ఏ వస్తువుపై ఎంత మేర డిస్కౌంట్ ఉంటుందన్న విషయం మాత్రం అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. HDFC Bank card వినియోగదారులు ఈ సేల్ లో 10 శాతం తగ్గింపును పొందొచ్చు. కొన్ని ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఇంకా ఎక్సేంజ్, ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Redmi Note 10 Pro Max: ఈ ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.19,999గా ఉంది. అయితే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభించనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల Full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5,020mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.