1. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధర చూస్తే మంత్లీ ప్లాన్ రూ.179, క్వార్టర్లీ ప్లాన్ రూ.459, యాన్యువల్ ప్లాన్ రూ.1,499 చొప్పున చెల్లించాలి. ఈ ప్లాన్ తీసుకున్నవారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్, అమెజాన్ మ్యూజిక్ యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎయిర్టెల్ యూజర్లు రూ.499, రూ.999, రూ.1199, రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 100జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇవి రెగ్యులర్, ఫ్యామిలీ యాడ్ ఆన్ ప్లాన్స్. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజులు, రూ.699 రీఛార్జ్ చేస్తే 56 రోజులు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. రూ.999 ప్లాన్‌లో రోజూ 2.5జీబీ డేటా, రూ.699 ప్లాన్‌లో రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. జియో యూజర్లు రూ.399, రూ.599, రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.399 ప్లాన్‌కు 75జీబీ డేటా, రూ.599 ప్లాన్‌కు 100జీబీ డేటా, రూ.799 ప్లాన్‌కు 150జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. వొడాఫోన్ ఐడియా యూజర్లు రూ.499, రూ.699, రూ.1099 ప్లాన్స్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రూ.499 ప్లాన్‌కు 75జీబీ డేటా, రూ.699, రూ.1099 ప్లాన్స్‌కు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. ఇవి ఇండివిజ్యువల్ ప్లాన్స్. (ప్రతీకాత్మక చిత్రం)
6. వొడాఫోన్ ఐడియా యూజర్లు రూ.999, రూ.1299, రూ.1699, రూ.2299 ప్లాన్స్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రూ.999 ప్లాన్‌కు 220జీబీ డేటా, రూ.1299 ప్లాన్‌కు 300జీబీ డేటా, రూ.1699, రూ.2299 ప్లాన్స్‌కు అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కుటుంబ సభ్యులు మూడు నుంచి ఐదు కనెక్షన్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)