Amazon: అమెజాన్ యూజర్లకు షాక్... రెండు గంటలపాటు ఇబ్బందులు
Amazon: అమెజాన్ యూజర్లకు షాక్... రెండు గంటలపాటు ఇబ్బందులు
Amazon India | అమెజాన్ యాప్‌లో ఆర్డర్ చేయలేక ఇబ్బందులు ఎదురయ్యాయా? అసలు అమెజాన్‌లో లాగిన్ చేయలేకపోయారా? మీకే కాదు... ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇదే సమస్య. ఏం జరిగిందో తెలుసుకోండి.
1. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అమెజాన్ వెబ్సైట్, యాప్ సరిగ్గా పనిచేయలేదు. భారతదేశంలోని యూజర్లు కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం రెండు గంటలపాటు ఈ సమస్య తలెత్తింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం సోమవారం ఉదయం రెండు గంటలపాటు ఈ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో సమస్యలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని యూజర్లు ప్రొడక్ట్ డిటెక్ట్ పేజ్ యాక్సెస్ చేయలేకపోయారు. ఆర్డర్ ప్లేస్ చేయడంలో సమస్యలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. మొత్తం 65 మంది యూజర్లు వెబ్సైట్ ఓపెన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొనగా, 23 శాతం మందికి లాగిన్ కావడంలో ఇబ్బందులు వచ్చాయి. ఇక 12 శాతం మంది యూజర్లు ప్రొడక్ట్ కార్ట్‌లో యాడ్ చేసినా చెకౌట్ చేయలేకపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఈ సమస్యల్ని గుర్తించిన అమెజాన్... వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. కొన్ని గంటల్లోనే సమస్యను పరిష్కరించింది. సేవలు యథావిధిగా కొనసాగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. సుమారు రెండు గంటలపాటు అమెజాన్ యూజర్లు షాపింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ అంతరాయానికి కారణమేంటో కంపెనీ వివరించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. జూన్‌లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సాతో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాగే అంతరాయం ఏర్పడింది. మేలో ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో అమెజాన్ కస్టమర్లకు సమస్యలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)