1. సాధారణంగా ఏ సేల్‌లో అయినా బ్యాంకు ఆఫర్లతో 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కానీ అమెజాన్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను 12 శాతం తగ్గింపుతో కొనొచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో సేల్ కొనసాగుతోంది. మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ (Redmi Note 10 Pro Max) స్మార్ట్‌ఫోన్ కొనాలని వెయిట్ చేస్తుంటే ఇది మంచి ఆఫరే. (image: Redmi India)
2. ప్రస్తుతం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు కూపన్ ఆఫర్ ద్వారా మరో రూ.800 తగ్గుతుంది. మొత్తం కలిపి రూ.2,300 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Redmi India)
3. ఆఫర్ తర్వాత రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,699 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,699 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. త్వరలో అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సేల్ కన్నా ముందే అదనంగా ఆఫర్ ప్రకటించడం విశేషం. (image: Redmi India)
6. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో నాలుగు కెమెరాలున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Redmi India)