1. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో 2జీబీ ర్యామ్ ఉంటే సరిపోయేది. ఆ తర్వాత 3జీబీ అవసరం వచ్చింది. యాప్స్ వినియోగం పెరగడంతో 4జీబీ ర్యామ్ కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు 6జీబీ ర్యామ్ ఉన్న స్మార్ట్ఫోన్లకు (6GB RAM Smartphones) డిమాండ్ కనిపిస్తోంది. అయితే వీడియో గేమ్స్ ఆడేవారు, ఎక్కువ యాప్స్ ఉపయోగించేవారు ర్యామ్ ఎక్కువగా ఉండాలని 8జీబీ ర్యామ్ ఉన్న మొబైల్స్ కొంటున్నారు. (image: Redmi India)
2. మార్కెట్లో 8జీబీ ర్యామ్ ఉన్న మొబైల్ కొనాలంటే గతంలో రూ.20,000 పైనే ఖర్చయ్యేది. ఇటీవల రూ.20,000 లోపే 8జీబీ ర్యామ్ మొబైల్ లభిస్తోంది. షావోమీ రెండు నెలల క్రితం రిలీజ్ చేసిన రెడ్మీ 10 పవర్ (Redmi 10 Power) స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంటే రూ.15,000 లోపే లభిస్తోంది. అమెజాన్‌లో ఆఫర్లో కొంటే రూ.14,999 లోపే 8జీబీ ర్యామ్ మొబైల్ లభిస్తుంది. (image: Redmi India)
3. రెడ్మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ధర రూ.14,999. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొంటే 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Redmi India)
4. అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసే వారికి రూ.14,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి ఈఎంఐ ఆప్షన్స్ రూ.706 నుంచి ప్రారంభం అవుతాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.5,000, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,500 చెల్లించాలి. (image: Redmi India)
5. రెడ్మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. (image: Redmi India)
6. రెడ్మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో కేవలం 10వాట్ ఛార్జింగ్ అడాప్టర్ మాత్రమే లభిస్తుంది. (image: Redmi India)