1. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ (Amazon Monsoon Carnival) సేల్‌లో స్మార్ట్ఫోన్లపై మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి భారీ డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. వన్‌ప్లస్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.20,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. (image: OnePlus India)
2. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్‌లో 6జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.18,999 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, 8జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.20,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. (image: OnePlus India)
3. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి ఇది మంచి అవకాశం. ఒకవేళ పాత మొబైల్‌కు రూ.20,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే రూ.2,000 లోపే చెల్లించి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. పాత మొబైల్‌కు అంతకన్నా తక్కువ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ వస్తే మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. (image: OnePlus India)
4. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ నేరుగా కొనేవారికి అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 తగ్గింపు పొందొచ్చు. (image: OnePlus India)
5. బ్యాంక్ ఆఫర్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ డస్ట్, బ్లూ టైడ్ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ ముగిసే వరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. స్టోరేజ్ నుంచి 5జీ ర్యామ్ పెంచుకోవచ్చు. (image: OnePlus India)
7. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (image: OnePlus India)
8. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: OnePlus India)