Amazon Mobile Savings Days Sale: అమెజాన్ లో అదిరే ఆఫర్.. ఇలా చేస్తే 5000mAh స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఈ ఒక్క రోజే ఛాన్స్
Amazon Mobile Savings Days Sale: అమెజాన్ లో అదిరే ఆఫర్.. ఇలా చేస్తే 5000mAh స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఈ ఒక్క రోజే ఛాన్స్
ఈ కామర్స్ దిగ్గజం అమోజాన్ లో ప్రస్తుతం మొబైల్ సేవింగ్ డేస్ సేల్(Amazon Mobile Savings Days Sale) నిర్వహిస్తోంది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై (Smartphones) భారీ డిస్కౌంట్ తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో కస్టమర్లు మొబైల్స్ మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపును పొందవచ్చు. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Tecno Pop 5 Liteను మంచి తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.8,999 కాగా ఫ్లిప్ కార్ట్ లో అమెజాన్ 30 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ను రూ. 2700 తగ్గింపుతో ఎవరైనా రూ. 6,299కి అమెజాన్ లో కొనుగోలు చేయొచ్చు.
2/ 6
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.629 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ ను మీరు కేవలం రూ.5,670కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీగా ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
3/ 6
మీ పాత ఫోన్ ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ Tecno Pop 5 Lite ఫోన్ ను దాదాపు ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై రూ.5900 ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా మీకు ఎక్సేంజ్ లభిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. మీరు ఈ ఫోన్ ను ఉచితంగానే సొంతం చేసుకోవచ్చు.
4/ 6
ఈ ఫోన్లో 6.5-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లే, 5000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే.. టెక్నో పాప్ 5 లైట్ 6.52-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ Unisoc SC9863 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
5/ 6
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్‌లో పని చేస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ Tecno Pop 5 Liteలో అందుబాటులో ఉంది. దీనిలో 8-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉంది.
6/ 6
సెల్ఫీ కోసం ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ V4.2, Wifi 802.11, GPS, FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-USB పోర్ట్, GPRS, 4G LTE వంటి ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.