1. అమెజాన్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో తొలిసారి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.23,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.21,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: OnePlus India)
2. రిలీజ్ అయినప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. సిటీ క్రెడిట్ కార్డ్, సిటీ డెబిట్ కార్డుతో కొంటే 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: OnePlus India)
3. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.17,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఏఐ సీన్ ఎన్హాన్స్మెంట్, ఏఐ హైలైట్ వీడియో, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్డీఆర్, నైట్స్కేప్, పోర్ట్రైట్ మోడ్, పనో, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: OnePlus India)
7. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, బ్లూటూత్, వైఫై, యూఎస్బీ టైప్ సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బహామా బ్లూ, గ్రే మిర్రర్ కలర్స్‌లో కొనొచ్చు. (image: OnePlus India)