ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో భారీ ఆఫర్లు అందించింది. అమెజాన్ మొబైల్ సేవింగ్ డే సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ ఇండియాలో ఈ రోజు ముగియినుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉంది. ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi Note 10: రెడ్ మీ నోట్ 10 మొబైల్ ను ఈ సేల్ లో రూ. 12,499కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ బేస్ మోడల్ 4GB ర్యామ్ తో పాటు 64GB స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పై ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఉంది. నెలకు రూ. 588 తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మూడు కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Full-HD+ AMOLED డిస్ప్లేతో పాటు 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.