1. అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. ప్రతీ ఏటా ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తూ ఉంటుంది అమెజాన్. ఏడాదిలో జరగబోయే అతిపెద్ద సేల్ ఇది. వాస్తవానికి ఈ సేల్ ఎప్పుడో జరగాల్సింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఈ సేల్ వాయిదాపడింది. జూలై 26, 27 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఇది కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం నిర్వహించే సేల్ మాత్రమే. (image: Amazon India)