అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) భారత ఓటీటీ యూజర్లకు అత్యంత సరసమైన ధరల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.179 చెల్లిస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివ్ చేసుకోవచ్చు. రూ.1,499కి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. అయితే తాజాగా ఇంతకన్నా చాలా తక్కువ ధరతో ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ లాంచ్ చేసింది.
ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సంవత్సరానికి రూ.599తో కొత్త మొబైల్ ఎడిషన్ ప్లాన్ ప్రారంభించినట్లు నవంబర్ 7న ప్రకటించింది. అంటే మొబైల్ యూజర్లు ఈ ప్లాన్ కింద నెలకు కేవలం దాదాపు రూ.50 చెల్లించి ప్రైమ్ వీడియోలకు యాక్సెస్ పొందొచ్చు. కాకపోతే ఈ యాన్యువల్ ప్లాన్ సింగిల్-యూజర్, మొబైల్-ఓన్లీ ప్లాన్‌గా వస్తుంది. ఒకే యూజర్, ఒకే మొబైల్‌కి వర్తించే ఈ సబ్‌స్క్రిప్షన్‌తో సినిమాలు, అమెజాన్ ఒరిజినల్ కంటెంట్, లైవ్ క్రికెట్ వంటి వాటికి యాక్సెస్ పొందొచ్చు.
ఇప్పుడు తీసుకొచ్చిన రూ.599 మొబైల్ ఎడిషన్ ఇయర్లీ ప్లాన్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో వీడియో క్వాలిటీ 480 పిక్సెల్కే పరిమితం అవుతుంది. ఇంతకన్నా క్వాలిటీతో వీడియోలు చూడాలనుకునేవారు వేరే ప్లాన్ ఎంచుకోవచ్చు. స్టాండర్డ్ డెఫినిషన్ (SD) క్వాలిటీతో వచ్చే చీప్ ప్లాన్‌తో కంటెంట్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా చూసుకోవచ్చు.
సాధారణంగా ప్రైమ్ ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అమెజాన్ మ్యూజిక్ స్ట్రీమింగ్కు యాక్సెస్, వివిధ ప్రొడక్ట్స్ ఫాస్ట్ & ఫ్రీ డెలివరీ, ప్రైమ్ డీల్స్‌కి ఎర్లీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. కానీ రూ.599 ప్లాన్ కింద ఆ బెనిఫిట్స్ ఏవీ లభించవు. రూ.1,499 చెల్లించలేని వారు, ఓన్లీ సింగిల్ మొబైల్ లాగిన్‌తో తక్కువ క్వాలిటీలో అన్ని వీడియోలు చూడాలనుకునే వారికి మాత్రమే ఈ ప్లాన్ బాగా సూట్ అవుతుంది. ఇలాంటి సరసమైన ప్లాన్స్ లాంచ్ చేయడంతో పాటు ప్రైమ్ వీడియో తన మొబైల్ ప్లాన్ యాక్సెసిబిలిటీని విస్తరిస్తోంది. అమెజాన్ ఎయిర్టెల్ సహకారంతో ఇప్పటికే తన సేవలను తక్కువ ధరలకే ఆఫర్ చేస్తోంది.
ఆ విజయాన్ని పురస్కరించుకుని మేం దాని యాక్సెస్‌ను విస్తరిస్తున్నాం, ఇప్పుడు ప్రైమ్ వీడియో యాప్, వెబ్సైట్ ద్వారా ఈ సబ్స్క్రిప్షన్ నేరుగా అందుబాటులో ఉంటుంది." అని ఈ ప్లాన్ లాంచ్ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ అన్నారు. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ముందుగా ఎయిర్టెల్ సహకారంతో నెలకు రూ.89 ప్రారంభ ధరతో ప్రారంభించారు. ఈ ప్లాన్ కింద ఎయిర్టెల్ 6జీబీ డేటా ఆఫర్ చేసింది.