దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేట్ రిప్లబిక్ డే సేల్ పేరుతో మెగా సేల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జనవరి 15న ప్రారంభమైన ఈ ఆఫర్లు.. మరో మూడు రోజుల వరకు కొనసాగనున్నాయి. ఈ సేల్‌లో గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ వరకు చాలా ప్రొడక్ట్స్ ధర భారీగా తగ్గింది.
ఇప్పుడు ఇంటెల్, హెచ్‌పీ, లెనోవో, యాపిల్, జబ్రానిక్స్, జేబీఎల్, ఆసుస్, డెల్, శామ్సంగ్, సోనీ, ఎల్జీ వంటి టాప్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌పై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్లపై 10 శాతం డిస్కౌంట్, కొనుగోలు చేసిన రోజే డెలివరీ ఛాయిస్, 12 నెలల 0% EMI, కూపన్లతో అదనంగా 5 శాతం డిస్కౌంట్, రూ.21వేల వరకు ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్స్ పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో ఒక రెండు ప్రొడక్ట్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవేంటో చూడండి.
దీంతో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులున్న ఫ్యామిలీ లేదా బ్యాచులర్స్‌కు ఇది షూటబుల్ అవుతుంది. దీని ఎనర్జీ స్టార్ రేటింగ్ 4 స్టార్. మ్యానుప్యాక్చర్ వారెంటీ... ప్రొడక్ట్‌పై ఒక సంవత్సరం, కంప్రెసర్‌పై పదేళ్లు ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది. దీంతో ఇది ఎక్కువ శక్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. శబ్దం కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలంగా మన్నికగా ఉంటుంది.
* ఐఫోన్ 13 : రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్లో ఐఫోన్ 13 128GB వేరియంట్‌పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.79,990 విలువ చేసే ఈ హ్యాండ్‌సెట్‌పై రూ. 20వేలకు పైగా డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ నుంచి దీన్ని రూ. 59,499కు సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, రెడ్, గ్రీన్, పింక్, స్టార్ లైట్(ఆఫ్-వైట్) వంటి ఐదు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
* స్పెసిఫికేషన్స్ : ఈ స్మార్ట్‌ఫోన్ 15 సెం.మీ (6.1-అంగుళాల) సూపర్ రెటినా XDR డిస్ప్లేతో లభిస్తుంది. ఈ డివైజ్ సినిమాటిక్ మోడ్ ఫీల్డ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో వీడియో షూట్ చేసేటప్పుడు ఆటోమెటిక్‌గా ఫోకస్ మారుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యుయల్ కెమెరా ఉంటుంది. ఇందులో 12MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి.