ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల 17 నుంచి 20 వరకు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే ఈ రోజు నుంచే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ కార్డుపై షాపింగ్ చేసిన వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్ ఫోన్లపై లభించే ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy M12: ఈ స్మార్ట్ పై ఈ సేల్ లో ఏకంగా 27 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ వాస్తవ ధర రూ.12999 కాగా ఈ సేల్ లో కేవలం రూ.9499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 15,485 కాగా డిస్కౌంట్ పై 11499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా వివిధ బ్యాంక్ ఆఫర్లు కూడా ఈ ఫోన్లపై అందుబాటులో ఉన్నాయి.
Tecno Pop 5 LTE: తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఎంపిక. ఈ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 7499 కాగా 16 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే కేవలం రూ.6299కే ఈ ఫోన్ ను ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఇంకా మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.5950 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ఫొందొచ్చు.