1. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో పాటు అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. సాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మూడు నెలల క్రితం రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,000 డిస్కౌంట్‌తో కొనొచ్చు. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్లో కాస్త తక్కువ ధరకే లభించినా ఆ తర్వాత ధర పెరిగింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ.8,000 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Samsung India)
3. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు కొనొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అంటే 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.21,999, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999 ధరకు కొనొచ్చు. (image: Samsung India)
4. ఆఫర్ వివరాలు చూస్తే అసలు ధర కన్నా రూ.8,000 తగ్గింపుతో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా మరో రూ.1,100 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 20న ముగుస్తుంది. అప్పటివరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఆ తర్వాత మళ్లీ పాత ధరలే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సింగిల్ టేక్ కెమెరా ఫీచర్ ఉంది. ఒక్క టేక్‌లో 10 ఫోటోస్ క్లిక్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ చేయొచ్చు. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ VoLTE, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌ను బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)