1. ఒప్పో ఇండియా మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (5G Smartphone) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పో ఏ78 5జీ (Oppo A78 5G) మొబైల్‌ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు మొబైల్ (Smartphone Under Rs 20000) సెగ్మెంట్లో ఒప్పో ఏ78 5జీ రిలీజైంది. (image: Oppo India)
2. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మాత్రమే రిలీజైంది. ధర రూ.18,999. ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ, వన్‌కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల నుంచి 6 నెలల ఈఎంఐతో ఒప్పో ఏ78 5జీ కొనొచ్చు. (image: Oppo India)
3. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ వివరాలు చూస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నోకాస్ట్ ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అదనంగా లభిస్తుంది. కేవలం రూ.1,000 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
4. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం 13 5జీ, పోకో ఎం4 5జీ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Oppo India)
5. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 13 + కలర్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Oppo India)
6. ఇందులో 5,000mAh భారీ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. SUPERVOOCTM సపోర్ట్ ఉంది. ఈ ఫీచర్‌తో 60 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే 23 గంటలపాటు వాడుకోవచ్చు. టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉండటం విశేషం. (image: Oppo India)
7. ప్రస్తుతం భారతదేశంలో 5జీ మొబైల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ భారతదేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో 5జీ నెట్వర్క్ లాంఛ్ చేయడంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ మొబైల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న యూజర్లను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కొత్తకొత్త 5జీ మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయి. (image: Oppo India)