1. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకే స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. రూ.22,499 విలువైన సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.22,499. కార్డు డిస్కౌంట్ రూ.3000 లభిస్తుంది. ఎస్బీఐ కార్డుల ద్వారా సాంసంగ్ గెలాక్సీ ఎం51 కొంటే రూ.3000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఫోన్‌ను రూ.19,499 ధరకే కొనొచ్చు. కార్డు డిస్కౌంట్ నవంబర్ 4న ముగుస్తుంది. (image: Samsung India)
3. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది సాంసంగ్. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.16,400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంకు డిస్కౌంట్ తర్వాత సాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర రూ.19,499. మీ పాత ఫోన్ విలువ రూ.16,400 ఉంటే మీరు చెల్లించాల్సింది కేవలం రూ.3099 మాత్రమే. (image: Amazon India)
5. ఇక దీంతో పాటు రూ.99 ధరకే సాంసంగ్ గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ కూడా ప్రకటించింది కంపెనీ. మీరు రూ.99 చెల్లించి ఈ ఎక్స్ఛేంజ్ ప్లాన్ తీసుకుంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను 10-12 నెలల్లో ఎక్స్ఛేంజ్ చేస్తే గ్యారెంటీడ్ వ్యాల్యూ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌కు రూ.13,499 గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ ప్రకటించింది. (image: Samsung India)
6. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం51 విశేషాలు చూస్తే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. భారతదేశంలో ఇంత భారీ బ్యాటరీ కెపాసిటీతో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6.7 అంగుళాల భారీ సూపర్ అమొలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Samsung India)