అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఈ రోజు అర్థరాత్రితో ముగియనుంది. సేల్ ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ సేల్ సమయంలో, కస్టమర్లు సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు రూపే కార్డులపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్ ఈ నెల 23న ముగియనుందని అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy M13: ఈ ఫోన్ సేల్‌లో రూ. 14,999కి బదులుగా రూ. 9,999కి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనిపై 33 శాతం రాయితీ అందిస్తోంది అమెజాన్. దీంతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.9,300 తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి-HD + LCD డిస్ప్లేను కలిగి ఉంది. పవర్ కోసం 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
Redmi K50i 5G: అమెజాన్ సేల్‌లో.. వినియోగదారులు ఈ ఫోన్‌ను రూ. 31,999కి బదులుగా కేవలం రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,200 తగ్గింపు సైతం అందుబాటులో ఉంది. పవర్ కోసం, ఈ ఫోన్ 5080mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి HD + LCD స్క్రీన్‌ను కలిగి ఉంది,