1. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, రూపే కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రూ.499 విలువైన ఇయర్‌ఫోన్స్ ఉచితంగా పొందొచ్చు. టోటల్ మొబైల్ ప్రొటెక్షన్ రూ.99 నుంచి ప్రారంభం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అమెజాన్ సేల్‌లో స్మార్ట్ఫోన్ల ఆఫర్స్ చూస్తే ఓ పాపులర్ సాంసంగ్ మొబైల్‌పై ఏకంగా రూ.6,000 తగ్గింపు లభిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో రిలీజ్ అయింది. రిలీజ్ ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మొబైల్ ఏకంగా రూ.6,000 డిస్కౌంట్‌తో లభిస్తుండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499. ప్రస్తుతం 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.15,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999 ధరకు అమెజాన్‌లో లిస్ట్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అమెజాన్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్ పైనా రూ.6,000 వరకు తగ్గింపు పొందొచ్చు. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి రూ.15,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Amazon India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఫీచర్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ వేరుగా కొనాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అమెజాన్ సేల్‌లో ఇతర సాంసంగ్ స్మార్ట్ఫోన్లపైనా ఆఫర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్‌ను రూ.52,999 ధరకు, సాంసంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్‌ను రూ.9,499 ధరకు, సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ మొబైల్‌ను రూ.11,999 ధరకు, సాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)