1. ఇటీవల ఒప్పో ఇండియా నుంచి ఒప్పో ఎఫ్21ఎస్ సిరీస్‌లో రెండు మొబైల్స్ వచ్చాయి. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ (Oppo F21s Pro 5G) మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వీటిలో ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 4జీ ఫోన్ మాత్రమే. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.20,000 పైనే డిస్కౌంట్ పొందొచ్చు. (image: Oppo India)
2. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్లో రిలీజైంది. ఇందులో అమొలెడ్ డిస్ప్లే, Sony IMX709 సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో మొదటి మైక్రోలెన్స్ కెమెరాతో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌గా ఒప్పో ప్రచారం చెబుతోంది. సెల్ఫీ లవర్స్‌కు ఈ ఫోన్ మంచి ఆప్షన్. (image: Oppo India)
3. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. ధర రూ.22,999. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. రూ.3,000 వరకు అదనంగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Oppo India)
4. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసి ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గరిష్టంగా రూ.21,849 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా లభించే రూ.3,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇందులోనే కలిపి ఉంటుంది. ఉదాహరణకు మీ పాత మొబైల్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే అదనంగా రూ.3,000 కలిపి మొత్తం రూ.18,000 తగ్గింపు లభిస్తుంది. (image: Oppo India)
5. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన 4జీ ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్ వివో టీ1 44W, వివో టీ1ఎక్స్, రియల్మీ 9, ఒప్పో ఎఫ్21 ప్రో, ఐకూ జెడ్6 లాంటి మోడల్స్‌లో ఉంది. (image: Oppo India)
6. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మైక్రోలెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, వీడియో, నైట్, ప్రో, పనో, పోర్ట్రెయిట్, ఎక్స్ట్రా హెచ్డీ, స్లోమో, టైమ్-లాప్స్, మైక్రోలెన్స్, స్టిక్కర్, టెక్స్ట్ స్కానర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
7. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో మొబైల్లో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX709 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. సెల్పీ లవర్స్‌ను ఆకట్టుకునే కెమెరా ఇది. ఉండగా, ఫ్రంట్ కెమెరాలో నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రెయిట్, పనో, టైమ్-లాప్స్, స్టిక్కర్ ఫీచర్స్ ఉన్నాయి. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా మరో 5జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. (image: Oppo India)