కరోనా పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఓటీటీలు విజృంభించే పరిస్థితి నెలకొంది. దీంతో స్మార్ట్‌టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్లదే మళ్లీ రాజ్యం. మీకూ ఓ మంచి స్ట్రీమిండ్ డివైజ్ కొనాలని ఉందా? అయితే అమెజాన్ రిలీజ్ చేసిన కొత్త ప్రోడక్ట్ మీద ఓ లుక్ వేయొచ్చు. ఇది టూ ఇన్ వన్ కూడా. స్ట్రీమింగ్ డివైజ్ కమ్ స్మార్ట్ స్పీకర్ అన్నమాట. మరి ఈ కొత్త డివైజ్ ఏంటి, ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంతో చూద్దామా!
ఫైర్ టీవీ క్యూబ్ (సెకండ్ జనరేషన్) పేరుతో అమెజాన్ ఈ కొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇది ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. గతేడాది వచ్చిన ఓఎస్‌కు కొన్ని మార్పులు చేసి ఇందులో కొత్తగా ఇస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో అమెజాన్ ఫైర్ టీవీ, ఎకో స్మార్ట్ స్పీకర్ ఉంటాయి. ఈ డివైజ్ అల్ట్రా హెచ్డీ హెచ్డీర్ స్ట్రీమింగ్కి సపోర్టు చేస్తుంది. దీంతోపాటు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వాయిస్‌తో (మాటలతో) యాక్టివ్ చేయొచ్చు. హెచ్డీఆర్ 10 ప్లస్, హెచ్డీర్ 10, హెచ్ఎల్జీ ఫార్మాట్లను ఈ టీవీ క్యూబ్ సపోర్టు చేస్తుంది. డాల్బీ అమ్మాస్ సౌండ్ టెక్నాలజీ ఉంటుంది.
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసు యాప్‌లన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, యూట్యూబ్ యాప్‌లు ముందుగా డౌన్లోడ్ అయి ఉంటాయి. ఈ క్యూబ్ కీలక ఆప్షన్‌గా హ్యాండ్స్ ఫ్రీ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను చెప్పొచ్చు. క్యూబ్‌లోని స్పీకర్, మైక్రోఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటాయి. మీరు ‘అలెక్సా’ అనే పదం అనగానే యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు మీకు కావాల్సిన ఓటీటీ/సర్వీసును చెప్పి టీవీలో ప్లే చేయొచ్చు. టీవీ క్యూబ్‌తో దానికి మందుగా కనెక్ట్ చేసి ఉన్న టీవీని ఆన్/ఆఫ్ కూడా చేయొచ్చు.
ఒకవేళ టీవీ/క్యూబ్‌కు సౌండ్ బార్‌ను కనెక్ట్ చేసి ఉంటే, దాన్ని యాక్సెస్ చేయవచ్చు. క్యూబ్‌తో రిమోట్ కూడా ఇస్తున్నారు. దీనిని మామూలు రిమోట్లాగే ఉపయోగించి టీవీ క్యూబ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఆ రిమోట్లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, అమెజాన్ మ్యూజిక్ లాంటి బటన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి నేరుగా ఆ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు.
ఎక్కడ దొరుకుతాయి....అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ (రెండో తరం) డివైజ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర ₹12,999. అమెజాన్‌తోపాటు క్రోమా, రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో లభిస్తుంది. మామూలుగా అయితే డివైజ్‌తో పాటు హెచ్డీఎంఐ కేబుల్ ఇవ్వరు. కానీ ప్రారంభ ఆఫర్ కింద ఆ కేబుల్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న యాపిల్ టీవీ 4కె మోడల్‌కు పోటీగా దీన్ని అమెజాన్ అభివృద్ధి చేసింది. యాపిల్ టీవీ 4కె ధర ₹18,900 ఉంటుందని టాక్.