రెడ్మి కే50ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 31,999. అయితే ఇప్పుడు దీన్ని రూ. 22,499కే కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకొని ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌పై రూ. 9500 వరకు తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో 6.6 అంగుళాల స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే మరో స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ కూడా ఉంది. షావోమి 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్‌పై సూపర్ డీల్ ఉంది. ఈ ఫోన్ ఎంఆర్పీ రూ. 33,999. అయితే దీన్ని ఇప్పుడు రూ. 19,499కు కొనొచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 64 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.