Amazon Offer: రూ.75,000 ఫోన్ రూ.19 వేలకే అందుబాటులో.. ఇలా కొనేయండి!
Amazon Offer: రూ.75,000 ఫోన్ రూ.19 వేలకే అందుబాటులో.. ఇలా కొనేయండి!
Samsung Galaxy S20 FE 5G | మీరు కొత్త ఫోన్ కొనే యోచనలో ఉంటే.. ఈ ఆఫర్ పరిశీలించొచ్చు. పాత ఫోన్ ఇచ్చి కొత్తది కొంటే భారీ తగ్గింపు లభిస్తుంది. రూ.19 వేల ధరలోనే అదిరే 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
5G Smartphone | కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అందుబాటు ధరలోనే శాంసంగ్ 5జీ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
2/ 9
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 75 వేల స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రూ. 19 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఇంత తక్కువకే ఫోన్ అందుబాటులో ఉందా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
3/ 9
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్2ను రూ. 19,690కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ఎంఆర్పీ రూ. 74,999. అంటే ఫోన్‌పై ఎంత భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
4/ 9
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఆప్షన్లలోని ఫోన్లపై అధిక డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 74,999 ధరలో లిస్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 32,990కు అందుబాటులో ఉంది.
5/ 9
అంటే ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరతో కొనుగోలు చేయొచ్చు. దీని కోసం మీ వద్ద పాత మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో మరింత తగ్గింపు పొందొచ్చు.
6/ 9
మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావిస్తే.. రూ. 13,300 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ ఫోన్, కండీషన్ ప్రాతిపదికన మారుతూ ఉటుంది. కొన్ని ఫోన్లకు తక్కువ రేటు కూడా రావొచ్చు.
7/ 9
ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మీ రూ. 13,300 వరకు తగ్గింపు వస్తే.. అప్పుడు మీకు ఈ శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 19,690కే లభించినట్లు అవుతుంది. లేదంటే ఇంకొంత ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు.
8/ 9
ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ప్రారంభం అవుతుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి కట్టాల్సి వస్తుంది.
9/ 9
ఈ ఫోన్లో 5జీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.5 అంగుళాల స్క్రీన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.