ప్రసార భారతీకి ఆర్థిక చేయూత అందించాలని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ బ్రాడ్ కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బిండ్) అనే స్కీమ్‌ను రూపొందించింది.దీని కింద బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటెంట్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్‌కు సంబంధించిన సివిల్ వర్క్ వంటి వాటిని డెవలప్ చేయనున్నారు. ఇప్పుడు దీనికి పచ్చజెండా ఊపింది.
దేశీ, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం అధిక నాణ్యత కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, మరిన్ని ఛానెల్‌లకు అనుగుణంగా డీటీహెచ్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యూజర్లకు విభిన్న కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో సర్వీసులు మరింత మెరుగుపడనున్నాయి.