చాలా మంది ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఉన్న ప్రతీ ఒక్కరు Facebook, Instagram, ట్విట్టర్ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో ఖాతాలను కలిగి ఉన్నాయి. ఈ మాధ్యమాల ద్వారా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, నాయకులు, వివిధ వర్గాలకు నాయకత్వం వహించే వారు, సంఘాల వారు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఏదైనా పోస్టుకు కామెంట్ పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇతరుల పరువుకు భంగం కలిగించే వాఖ్యలు, కించ పరిచే వాఖ్యలు చేయకపోవడం చాలా ముఖ్యం. ఎవరైనా తమ పోస్ట్ కింద కులం లేదా ఏదైనా ప్రత్యేక మతానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే, అతను మీపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కామెంట్ల విభాగంలో అవమానించే, దుర్వినియోగం చేసే లేదా అశ్లీల చిత్రాలను పంపే వారిపై మీరు చర్య తీసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)