1. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, రిస్కులు కూడా అంతేలా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నిత్యం మాల్వేర్ (Malware) రూపంలో ముప్పు వస్తూనే ఉంటుంది. పాత మాల్వేర్ మళ్లీ కొత్త రూపంలో వచ్చింది. నాలుగు హానికరమైన యాప్స్‌లో ఈ మాల్వేర్ బయటపడింది. ఇప్పటికే ఈ నాలుగు యాప్స్‌ను 100,000+ పైగా యూజర్లు డౌన్లోడ్ చేశారని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
2. తాజాగా ఈ నాలుగు యాప్స్‌లో బయటపడ్డ మాల్వేర్ పేరు జోకర్. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు జోకర్ మాల్వేర్ కొత్తేమీ కాదు. ఇప్పటికే వందలాది యాప్స్‌లో ఈ మాల్వేర్ బయటపడింది. గూగుల్ అప్రమత్తమై ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను డిలిట్ చేసింది. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ నాలుగు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ బయటపడింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రేడియో (Pradeo) పరిశోధన ప్రకారం నాలుగు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ ఉంది. వీటిని 100,000+ పైగా యూజర్లు డౌన్లోడ్ చేశారు. స్మార్ట్ ఎస్ఎంఎస్ మెసేజ్ (Smart SMS Message) యాప్ 50,000+ పైగా ఇన్స్టాల్స్, బ్లడ్ ప్రెజర్ మానిటర్ (Blood Pressure Monitor) యాప్ 10,000+ పైగా ఇన్స్టాల్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక వాయిస్ లాంగ్వేజెస్ ట్రాన్స్‌లేటర్ (Voice Languages Translator) యాప్ 10,000+ పైగా ఇన్స్టాల్స్, క్విక్ టెక్స్ట్ ఎస్ఎంఎస్ (Quick Text SMS) యాప్ 10,000+ పైగా ఇన్స్టాల్స్ ఉన్నట్టు తేలింది. ఒకవేళ మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ డౌన్లోడ్ చేసినట్టైతే వెంటనే వీటిని డిలిట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. జోకర్ మాల్వేర్ చాలా ఏళ్ల క్రితమే బయటపడింది. ఇప్పటికే లక్షలాది డివైజ్‌లపై ప్రభావం చూపించింది. తాజాగా బయటపడ్డ మాల్వేర్ గూగుల్ రూపొందించిన యాప్‌ల్లో ఉండే సాధారణ భద్రతా స్క్రీనింగ్‌ను బైపాస్ చేస్తుందని తేలింది. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్‌ను ప్లేస్టోర్‌లో స్క్రీనింగ్ ద్వారా గుర్తించడం కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)
6. గూగుల్ ప్లే స్టోర్ భద్రతా ప్రక్రియను మెరుగుపరిచినట్టు గూగుల్ వివరించింది. కానీ గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్‌లో జోకర్ మాల్వేర్ తరచూ బయటపడుతోంది. ఫలితంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడుతున్నారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. తాము ఉపయోగించే యాప్స్‌లో మాల్వేర్ ఉన్నట్టు తెలిస్తే వాటిని డిలిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక యాప్స్ డౌన్లోడ్ చేసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తుతెలియని డెవలపర్స్ రూపొందించే యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. పాపులర్ కంపెనీలు తయారు చేసే యాప్స్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఒక యాప్ డౌన్లోడ్ చేసేముందు డెవలపర్ పేరు తప్పనిసరిగా చూడాలి. లైసెన్స్డ్ యాంటీ వైరస్ యాప్ ఉపయోగించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)