1. ఇటీవల గూగుల్ 150 ప్రమాదకర యాప్స్‌ను ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఉండే యాప్స్‌ను (malicious android apps) సంస్థ నిషేధిస్తుంది. ప్రమాదకర దాడులను అరికట్టడానికి, వినియోగదారుల గోప్యతను రక్షించడానికి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా మరో మూడు యాప్స్ ను వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించింది గూగుల్. (ప్రతీకాత్మక చిత్రం)
2. వ్యక్తిగత సమాచారంతో పాటు యూజర్ల నుంచి డబ్బును తస్కరించే మోసపూరిత వ్యూహాలను అవలంభిస్తుండటంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ ఈ అప్లికేషన్లను గుర్తించింది. ఫేస్బుక్ లాగిన్ మెకానిజాన్ని ఉపయోగించి వినియోగదారుల సమచారాన్ని తస్కరిస్తున్నట్లు కనుగొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ వివరాలు చూస్తే "మ్యాజిక్ ఫోటో ల్యాబ్- ఫొటో ఎడిటర్"(Magic Photo Lab - Photo Editor), "బ్లెండర్ ఫొటో ఎడిటర్- ఈజీ ఫొటో బ్యాంక్ గ్రౌండ్ ఎడిటర్"(Blender Photo Editor-Easy Photo Background Editor), "పిక్స్ ఫొటో మోషన్ ఎడిట్ 2021"(Pix Photo Motion Edit 2021)... ఈ అప్లికేషన్లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఫోన్ల నుంచి మ్యానువల్ గా వాటిని తీసివేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్ లాగిన్ వివరాలను కూడా మార్చాలి. వినియోగదారులు తమ డేటాను సురక్షితంగా ఉంచడానికి, తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడకుండా నిరోధించడానికి బాగా తెలిసిన ఫొటో ఎడిటింగ్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)