1. పాతతరం స్మార్ట్ఫోన్లు వాడేవారికి త్వరలో సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ (WhatsApp) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర సంస్థలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి. సోమవారం నుంచి ఆండ్రాయిడ్ పాత వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లలో గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్, ఇతర ప్రముఖ యాప్‌లకు సపోర్ట్‌ను గూగుల్ ఉపసంహరించుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. యూజర్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ చెబుతోంది. ‘సెప్టెంబర్ 27 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7 లేదా అంతకు ముందు వెర్షన్ ఓఎస్‌తో పనిచేసే డివైజ్‌లలో గూగుల్ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయలేరు. సోమవారం నుంచి డివైజ్‌లో సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఐడీ, పాస్వర్డ్ వివరాలు తప్పుగా ఎంటర్ చేశారని చూపిస్తుంది. వీరు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటి గూగుల్ ప్రొడక్స్ట్ సేవలను ఉపయోగించడం కుదరదు’ అని కంపెనీ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సోనీ ఎక్స్‌పీరియా అడ్వాన్స్, లెనోవో K800, సోనీ ఎక్స్‌పీరియా గో, వొడాఫోన్ స్మార్ట్ II, శామ్సంగ్ గెలాక్సీ S2, సోనీ ఎక్స్‌పీరియా పీ, ఎల్జీ స్పెక్ట్రమ్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్.. డివైజ్‌లలో గూగుల్ యాప్స్ ఓపెన్ కావు. LG ప్రాడా 3.0, HTC వెలాసిటీ, HTC ఎవో 4G, మోటొరోలా ఫైర్, మోటొరోలా XT532.. డివైజ్‌లకు గూగుల్ మద్దతు ఉపసంహరించుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)