1. గూగుల్ మరో మూడు యాప్స్‌ని నిషేధించింది. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి మూడు యాప్స్‌ని తొలగించింది. ఈ మూడు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ (Joker Malware) ఉన్నట్టు గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి డిలిట్ చేసింది. యూజర్లు ఈ యాప్స్ వాడుతున్నట్టైతే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
3. జోకర్ మాల్వేర్ గూగుల్ భద్రతా చర్యలను అధిగమించి మరీ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వచ్చిందని, తర్వాత యూజర్ల స్మార్ట్ఫోన్లపై దాడి చేసి అకౌంట్లు ఖాళీ చేస్తోందని Igor Golovin అనే ఆథర్ రీసెర్చ్ వివరాలను వెల్లడించారు. Trojan.AndroidOS.Jocker ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్రోజన్లు టెక్స్ట్ మెసేజెస్ పంపి యాంటీ ఫ్రాడ్ సొల్యూషన్స్‌ని దాటుతున్నాయని రీసెర్చ్‌లో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సాధారణంగా జోకర్ మాల్వేర్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమవుతాయి. ఇక అక్కడి నుంచి స్కామర్ల పని మొదలవుతుంది. చట్టబద్ధమైన యాప్స్‌లో హానికరమైన కోడ్స్ ఎంటర్ చేసి మళ్లీ ప్లేస్టోర్‌లోకి మరో పేరుతో అప్లోడ్ చేస్తుంటారు. ఆ తర్వాత ట్రోజన్లు తమ పని మొదలుపడతాయి. సబ్స్క్రిప్షన్ ద్వారా అకౌంట్ ఖాళీ చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. తాజాగా జోకర్ మాల్వేర్ బయటపడ్డ మూడు యాప్స్ వివరాలు చూస్తే Style Message (com.stylelacat.message around), Blood Pressure App (blood.maodig.raise.bloodrate.monitorapp.plus.tracker.tool.health), Camera PDF Scanner (com.jiao.hdcam.docscanner) పేరుతో ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది కాబట్టి ఇప్పటికే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసిన యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ చేయడం అవసరం. ఇలా గూగుల్ ప్రమాదకరమైన యాప్స్ తొలగించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వందల సంఖ్యలో మాల్వేర్ ఉన్న యాప్స్ తొలగించింది. వాటిని యూజర్లు ఉపయోగించకపోవడమే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ బారినపడకుండా ఉండాలంటే యాప్స్ ఇన్స్టాల్ చేసేప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎట్టిపరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకూడదు. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నా ఓసారి డెవలపర్ ఎవరు, రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)