1. ఇండియాలోని ఇన్స్టాగ్రామ్ యూజర్లకు షాక్. కొత్త రూల్స్ ప్రకటించింది ఇన్స్టాగ్రామ్. ఈ ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించాలంటే ఇక వయస్సును కూడా ధృవీకరించాలి. యూజర్లు తమ వయస్సును వెరిఫై చేసే ఫీచర్‌ను భారతదేశంతో పాటు బ్రెజిల్లో కూడా ప్రారంభిస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ తాజాగా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఏజ్ వెరిఫికేషన్ ఫీచర్ 2022 జూన్‌లో అమెరికాలో మొదటిసారి అమలులోకి వచ్చింది. యూజర్లు వీడియో సెల్ఫీని రికార్డ్ చేయడం లేదా ఫోటో ఐడీని అప్లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును ధృవీకరించాలి. 18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నించేవారు ఎవరైనా ఈపనిచేయాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీడియో సెల్ఫీ ఆప్షన్ కోసం మెటా యూకేకు చెందిన డిజిటల్ ఐడెంటిటీ ప్రొవైడర్ అయిన యోటీతో ఒప్పందం చేసుకుంది. యూజర్ల ముఖ లక్షణాల ఆధారంగా వయస్సును అంచనా వేస్తుంది ఈ సంస్థ. వెరిఫికేషన్ కోసం ఫోటో లేదా వీడియో తీసుకున్న తర్వాత మెటా, యోటీ సంస్థలు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆ ఫైల్‌ను డిలిట్ చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ టెక్నాలజీతో వయస్సు తప్ప ఇతర ఐడెంటిటీ ఏదీ గుర్తించదని మెటా స్పష్టం చేసింది. ఇక ఫోటో ఐడీ ఆప్షన్ కోసం ఇన్స్టాగ్రామ్ పలు ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ను స్వీకరిస్తుంది. బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ టెస్ట్ ద్వారా టీనేజర్లను, పెద్దలను గుర్తించడంతో పాటు, వారి వయస్సుకు తగిన అనుభవంలో ఉన్నారని నిర్ధారించడం లక్ష్యమని ఇన్స్టాగ్రామ్ చెబుతోంది. ఈ ఏడాది చివరి నాటికి యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్‌లో కూడా ఈ ఫీచర్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే ఇండియాలో పేరెంటల్ సూపర్విజన్ టూల్స్ అందిస్తోంది ఇన్స్టాగ్రామ్. (ప్రతీకాత్మక చిత్రం)
8. పేరెంటల్ సూపర్విజన్ టూల్స్ ద్వారా తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని నిఘా పెట్టొచ్చు. దీంతో పాటు ప్రముఖ నిపుణుల నుంచి మరిన్ని పర్యవేక్షణ సాధనాలు, వనరులను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రులు, సంరక్షకులకు ఫ్యామిలీ సెంటర్ పేరుతో హబ్ రూపొందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)