1. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో హెచ్చరిక. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్ అన్నీ సురక్షితమైనవి కావు. అందులో మాల్వేర్, ట్రోజన్ లాంటి అనేక హానికరమైన వైరస్లు ఉన్నాయి. తాజాగా మరో లిస్ట్ బయటకు వచ్చింది. మొబైల్ డివైజ్‌లల్లో వైరస్ యాక్టివిటీస్‌పై డాక్టర్ వెబ్ జూన్ 2022 రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఆ రిపోర్ట్ ప్రకారం హానికరమైన యాప్‌లు ఆండ్రాయిడ్‌కు ముప్పుగా మారాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. జూన్‌లో Android.Spy.4498 ట్రోజన్ యాక్టివిటీ కనిపించింది. ఈ ట్రోజన్ యాప్స్ నోటిఫికే,న్స్ నుంచి సమాచారాన్ని కాజేస్తుంది. మే నెలతో పోలిస్తే ఈ ట్రోజన్ యాక్టివిటీ 20.56 శాతం తగ్గింది. ఇక Android.HiddenAds యాడ్వేర్ ట్రోజన్ ప్రభావం కూడా 8 శాతం తగ్గింది. అయినా ఈ వైరస్లు ఉన్న హానికరమైన యాప్స్ ఆండ్రాయిడ్‌కు తలనొప్పిగా మారాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. డాక్టర్ వెబ్ మాల్వేర్ అనలిస్టులు ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్‌లో డజన్ల కొద్దీ హానికరమైన యాప్‌లను గుర్తించారు. వాటిలో యాడ్వేర్ ట్రోజన్లు, స్కామర్లు ఉపయోగించే నకిలీ యాప్‌లు, కాన్ఫిడెన్షియల్ డేటాను లక్ష్యంగా చేసుకునే ఇన్ఫో-స్టీలర్లు ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వైరస్‌లతో స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆండ్రాయిడ్‌లో 30 యాడ్వేర్ ట్రోజన్లు ఉన్న యాప్స్‌ని 98,90,000 సార్లు డౌన్లోడ్ చేసినట్టు తేలింది. ఎక్కువగా ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వర్చువల్ కీబోర్డ్స్, సిస్టమ్ టూల్స్, యుటిలిటీస్, కాలింగ్ యాప్స్, వాల్‌పేపర్ కలెక్షన్ యాప్స్ లాంటివే ఉన్నాయి. యాడ్స్ చూపించడానికి యాప్స్ అనుమతి అడుగుతుంటాయి. కానీ ఈ యాప్స్ అలాంటి పర్మిషన్స్ లేకుండా యాడ్స్ చూపిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. తాజాగా బయటపడ్డ హానికరమైన యాప్స్‌లో Cashe Cleaner, Emoji Keyboard: Stickers & GIF, FastCleaner: Cashe Cleaner, Funny Wallpapers - Live Screen, Neon Theme Keyboard, Notes - reminders and lists, Photo & Exif Editor, Photo Editor & Background Eraser, Photo Editor - Design Maker, Photo Editor - Filters Effects, Photo Editor : Blur Image, Photo Editor : Cut Paste, Photo Editor: Art Filters, Photo Editor: Beauty Filter, Photo Editor: Retouch & Cutout, Photo Filters & Effects లాంటి యాప్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక డాక్టర్ వెబ్ స్పెషలిస్టులు ఆండ్రాయిడ్ జోకర్ ఫ్యామిలీకి చెందిన మరిన్ని ట్రోజన్లను గుర్తించారు. ఆ ట్రోజన్లు యూజర్ల ప్రమేయం లేకుండా పెయిడ్ మొబైల్ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నాయి. థర్డ్ పార్టీ లాంఛర్ అయిన Poco Launcher, 4K Pro Camera, Heart Emoji Stickers లాంటి యాప్స్‌లో ఈ ట్రోజన్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)