1. ఎయిర్టెల్ ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) ధరల్ని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ఎయిర్టెల్ (Airtel) ప్లాన్స్ కొంతకాలం క్రితమే అమలులోకి వచ్చాయి. గతంలో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. కాబట్టి ఎయిర్టెల్ యూజర్లు కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీరు గతంలో 1.5జీబీ డేటా లభించే ప్లాన్ రీఛార్జ్ చేసినట్టైతే గడువు ముగిసిన తర్వాత కింద వివరించిన ప్లాన్స్ రీఛార్జ్ చేయాలి. లేదా మీరు రోజూ 1.5జీబీ డేటా కావాలనుకుంటే ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. సాధారణంగా రోజూ 1.5జీబీ డేటా ప్లాన్స్‌ను ఎక్కువగా రీఛార్జ్ చేస్తూ ఉంటారు యూజర్లు. మరి ఎయిర్‌టెల్‌లో రోజూ 1.5జీబీ డేటా లభించే ప్లాన్స్ ఏవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రూ.249 ప్లాన్‌ను రూ.299కి పెంచింది ఎయిర్టెల్. ఎయిర్టెల్ రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెంచింది ఎయిర్టెల్. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎయిర్టెల్ రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రూ.598 ప్లాన్‌ను రూ.719కి పెంచింది ఎయిర్టెల్. ఇతర ప్లాన్స్‌తో పోలిస్తే ఈ ప్లాన్ యూజర్లకు కాస్త భారమైంది. రూ.299, రూ.479, రూ.719 ప్లాన్స్‌పై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు అపోలో 24 / 7 సర్కిల్ మూడు నెలల యాక్సెస్, షా అకాడమీలో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచితంగా హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఎయిర్‌టెల్‌లో రోజూ 1జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎయిర్టెల్ యూజర్లు రోజూ 1జీబీ డేటా ఉపయోగిస్తున్నట్టైతే ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.155 ప్లాన్ రీఛార్జ్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. మొత్తం 300 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. రూ.219 ప్లాన్‌ను రూ.265కి పెంచింది ఎయిర్టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూ.155, రూ.239, రూ.265 ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా బెనిఫిట్స్‌తో పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ యాక్సెస్, ఉచితంగా హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. వాయిస్ కాల్స్ ఎక్కువ, మొబైల్ డేటా కాస్త తక్కువ ఉపయోగించేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)