భారతదేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్టెల్ తరచుగా అనేక కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతోంది. తద్వారా కొత్త కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ల ధరలు రూ.699, రూ.999. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Airtel Rs.699 Plan: ఎయిర్టెల్ తాజాగా రూ.699 ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోలు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 3GB డేటా లభిస్తుంది. కంపెనీ తన వినియోగదారులకు 56 రోజుల్లో మొత్తం 168 GB డేటాను అందిస్తుంది. ఇది కాకుండా, కంపెనీ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ప్రతిరోజూ 100 SMSలను కూడా అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్లాన్లను ఎంచుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సైతం ఉచితంగా ఇవ్వబడుతోంది. 699 ప్లాన్లో 56 రోజులు మరియు 999 ప్లాన్లో 84 రోజులు సభ్యత్వం లభిస్తుంది. ఇది కాకుండా.. వినియోగదారులు Airtel Xstream Mobile Pack, Apollo 24/7 Circle, Free HelloTunes మరియు Wink Music Freeలకు ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)