1. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ సేవలు కొన్ని నిమిషాలపాటు నిలిచిపోయాయి. అనేకమంది ఎయిర్టెల్ యూజర్లు ట్విట్టర్లో కంప్లైంట్స్ చేశారు. తమ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ (Broadband Services) ఆకస్మికంగా పనిచేయడం ఆగిపోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. దీంతో ఎయిర్టెల్ స్పందించింది. సేవల్ని పునరుద్ధరించినట్టు తెలిపింది. తమ ఇంటర్నెట్ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగిందని, దీనివల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని, యూజర్లకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు తమ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎయిర్టెల్ ట్వీట్ చేసింది. (image: Airtel)
4. ఇలాంటి అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ అయిన డౌన్‌డిటెక్టర్ ఎయిర్టెల్ సేవలు నిలిచిపోయినట్టు గుర్తించుంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా లాంటి ప్రాంతాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఎయిర్టెల్ సిగ్నల్ సమస్యలకు సంబంధించి 3700 పైగా ఫిర్యాదులు అందాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎయిర్‌టెల్‌కు చెందిన టెలికామ్ సేవలు, బ్రాడ్బ్యంక్ సేవలతో పాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ సర్వీసుల్లో కూడా అంతరాయం కలిగిందని ఈ ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. సుమారు 10 నిమిషాల పాటు ఈ సేవల్లో అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ సేవలు యథావిధిగా అందుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)