Airtel Plans | ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అనేది దేశంలోని అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రస్తుతం ఐదు రకాల ప్లాన్స్‌ను కస్టమర్లకు అందిస్తోంది. గత కొన్నేళ్లుగా చూస్తే కంపెనీ ఈ ప్లాన్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ప్లాన్స్ ద్వారా అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. ధర కూడా అందుబాటులో ఉంది.
రూ. 499 ప్లాన్ విషయానికి వస్తే.. దీని స్పీడ్ 40 ఎంబీపీఎస్. ఈ ప్లాన్ కింద అపరిమిత డేటా పొందొచ్చు 3.3 టీబీ వరకు ఫాస్ట్ డేటా వస్తుంది. తర్వాత స్పీడ్ తగ్గుతుంది. అలాగే ఈ ప్లాన్ కింద ఉచితంగా ఫిక్స్డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్ కింద ఎక్స్ప్రీమ్ ప్రీమియం, అపోలో 24, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇక చివరిగా రూ. 3,999 ప్లాన్ ఉంది. ఇంలో స్పీడ్ 1 జీబీపీఎస్ వస్తుంది. నెలవారీ డేటా లిమిటల్ 3.3 టీబీ. అపరమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వీఐపీ సర్వీస్, వింక్ ప్రీమియం, ఎక్స్ట్రీమ్ ప్రీమియం వంటి సర్వీసులు అన్నీ పొందొచ్చు. అంటే మీరు ఒక్క ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్పామ్స్ యాక్సెస్ పొందొచ్చు.