కంపెనీ దీని స్థానంలో రూ. 155 రీచార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇదే మినిమమ్ రీచార్జ్ ప్లాన్. ఇందులో కస్టమర్లకు 1 జీబీ డేటా వస్తుంది. అలాగే 300 ఎస్ఎంఎస్లు పంపొచ్చు. దీని వాలిడిటీ 28 రోజులు. కంపెనీ తొలిగా ఈ ప్లాన్‌లో హరియాణ, ఒడిశాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఇతర సర్కిళ్లలో కూడా ఈ ప్లాన్ అందుబాటోల ఉండనుంది.
ఎయిర్టెల్ కంపెనీ రూ. 155 ధర కన్నా తక్కువలో ఉన్న అన్ని కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్స్‌ను తొలగించాలని భావిస్తోందని తెలుస్తోంది. 28 రోజుల వాలిడిటీతో రూ. 155 ప్లాన్‌ను ప్రారంభ ప్లాన్‌గా ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇదే జరిగితే కస్టమర్లు కేవలం ఎస్ఎంఎస్ సర్వీసులు పొందాలన్నా కూడా రూ. 155 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సి రావొచ్చు.