1. ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని (Prepaid Plans) ప్రకటించింది ఎయిర్టెల్. ఈ ప్లాన్స్ రూ.499 నుంచి మొదలవుతాయి. రూ.499, రూ.699, రూ.2,798 ప్లాన్స్‌ని కొత్తగా ప్రకటించింది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఒక ఏడాది ఉచితంగా లభిస్తుంది. అయితే ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో ఉన్న ప్లాన్స్ కన్నా కొత్త ప్లాన్స్ ధర ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే రిలయెన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఎక్స్ట్రా బెనిఫిట్స్‌తో 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎయిర్టెల్ 3 కొత్తప్లాన్స్ ప్రకటించింది. పాత ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఇచ్చిన ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. Airtel Rs 499 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Airtel Rs 699 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Airtel Rs 2798 Prepaid Plan: ఎయిర్టెల్ రూ.2798 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. కొత్త ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ 30 రోజులకు లభిస్తుంది. హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్సులు, ఎయిర్టెల్ యాప్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)