2. సాధారణంగా తేమతో కూడిన పరిస్థితులలో ఎయిర్ కూలర్లు సరిగా పని చేయలేవు. వాస్తవానికి, అవి పరిసరాలను మరింత తేమగా మారుస్తాయి. దీనివల్ల పరిసరాల్లో తేమశాతం ఎక్కువై చల్లటిగాలి రావడానికి బదులు వేడిగాలి వస్తుంది. అయితే కొన్ని మోడర్న్ కూలర్లు వాతావరణానికి అనుగుణంగా తేమ స్థాయిని మేనేజ్ చేసి చల్లటి గాలిని అందిస్తాయి. వీటిలో ఉండే 'హ్యూమిడిటీ కంట్రోల్' ఫీచర్ కూలింగ్ ప్యాడ్లపై నీటి ప్రవాహాన్ని అడ్జస్ట్ చేసి హ్యూమిడిటీని నియంత్రిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆటో ఫిల్ అనేది ఎయిర్ కూలర్లతో వచ్చే మరో ముఖ్యమైన ఫీచర్. కూలర్లలో ఎప్పుడూ వాటర్ ఉంచడం తప్పనిసరి. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు వీటిలో నీళ్లు అయిపోతే గుర్తించడం కష్టం. దీనివల్ల కూలర్ పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగే చల్లటి గాలి కూడా రాదు. ఈ సమస్యకు ఆటో ఫిల్ ఫీచర్ చెక్ పెడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇది కూలర్లో వాటర్ అయిపోగానే ఆటోమేటిక్‌గా సరిపడా నీటిని నింపుతుంది. అయితే, యూజర్లు దీని కోసం కూలర్‌ను ఏదైనా నీటి పంపుకు కనెక్ట్ చేయాలి. ఎయిర్ కూలర్ల నుంచి ఓల్డ్, డర్టీ వాటర్ తీసి పారేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. ఆటో డ్రెయిన్ ఫంక్షన్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది కూలర్ నుంచి నీటిని ఆటోమేటిక్‌గా బయటకు పంపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎయిర్ కూలర్లలో మస్కిటో నెట్ లేదా ఇన్సెక్ట్ నెట్ అనేది కొత్తగా వస్తున్న ఫీచర్. ఈ నెట్ వల్ల దోమలు, ఇతర కీటకాలు కూలర్‌లోకి ప్రవేశించవు. స్మార్ట్ఫోన్ల ద్వారా కంట్రోల్ చేసే ఎయిర్ కూలర్లు ఇప్పుడు వస్తున్నాయి. వై-ఫై కనెక్టివిటీతో వచ్చే ఈ కూలర్లను ఫోన్ ద్వారానే ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. స్వింగ్ మోడ్‌ని కూడా టర్న్ ఆన్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మోడర్న్ కూలర్లు ఇప్పుడు అలెక్సా, అసిస్టెంట్ వాయిస్ కమాండ్లకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. తద్వారా యూజర్లు తమ వాయిస్‌ని ఉపయోగించి కూలర్లు కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. కొన్ని కూలర్లు బిల్ట్-ఇన్ PM 2.5 ఫిల్టర్లతో ఎయిర్ ప్యూరిఫైయర్‌గా కూడా పని చేస్తున్నాయి. దీని వల్ల పరిసరాలు పరిశుభ్రంగా, దుమ్ము లేకుండా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7 . ఎయిర్ కూలర్లలో టచ్ బటన్లు కూడా వచ్చాయి. ఇవి సాధారణంగా రిమోట్ కంట్రోల్‌తో వచ్చే కూలర్లలో కనిపిస్తాయి. మోటర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అనేది ఎయిర్ కూలర్ మోటర్ దెబ్బతినకుండా నిరోధించే ఒక సేఫ్టీ చెక్. ఈ ఫీచర్ విద్యుత్ ప్రవాహం ఒక్కసారిగా పెరిగితే మోటారును ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా, నీరు పూర్తిగా అయిపోయినప్పుడు కూడా ఇది మోటారును రక్షిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)