1. సర్వీసింగ్ చేయించండి
ఎయిర్ కండీషనర్లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ప్రతి సీజన్ ప్రారంభంలో లేదా సంవత్సరానికి ఒకసారి ఏసీలను పూర్తిగా చెక్ చేయాలి. అవసరాన్ని బట్టి ఎక్కువసార్లు కూడా సర్వీసింగ్ చేయించవచ్చు. ఈ ప్రక్రియలో ACలోని కాయిల్స్‌ను నిపుణులు శుభ్రం చేస్తారు. వోల్టేజ్ కనెక్షన్స్, కూలింగ్ లెవల్ వంటివన్నీ చెక్ చేస్తారు. దీనివల్ల ఏసీలు వర్కింగ్ కండిషన్లో పనిచేస్తాయి. ఇలా వాటి పనితీరు పెరిగి విద్యుత్ వినియోగం ఎంతోకొంత తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయండి
మీ ACలలోని ఎయిర్ ఫిల్టర్లు HVAC సిస్టమ్ వద్దకు ధూళిని చేరనివ్వవు. దీంతో ఏసీ వినియోగం సాఫీగా ఉంటుంది. అయితే ఎయిర్ ఫిల్టర్లు డస్ట్‌ను బ్లాక్ చేస్తాయి కాబట్టి.. అవి మురికిగా ఉంటాయి. వీటిని ప్రతిసారి శుభ్రం చేయాలి. ఫిల్టర్ల దుమ్ము దులిపి నీటితో కడిగితే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)