ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన రాజేష్ మౌర్య స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. హోలీ సందర్భంగా సేల్స్ పెంచుకోవడానికి ఈ భిన్న స్ట్రాటజీ అమలు చేయాలని చూశాడు. ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు బీర్లు ఫ్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాడు. పాంప్లెట్లు ప్రింట్ చేయించి పంపిణీ చేశాడు.
* పోలీసుల దృష్టికి.. : రాజేష్ మౌర్య వేసిన ప్లాన్ ఆనోటా ఈనోటా పడి పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే అధికారులు కలగజేసుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చట్ట విరుద్ధం అంటూ రాజేష్ మౌర్యను హెచ్చరించారు. కానీ అప్పటికే అందరికీ ఆఫర్ గురించి తెలిసిపోవడంతో పెద్దఎత్తున కస్టమర్లు తరలి వచ్చారు. దీంతో రాజేష్ స్టోర్ బయట భారీగా క్యూ లైన్ ఏర్పడింది.
* ఎందుకు చట్ట విరుద్ధం? : కస్టమర్లను ఆకట్టుకునేందుకు లిక్కర్, దాని అనుబంధ ప్రొడక్టులను ఆఫర్ల కింద ప్రకటించకూడదు. ఇది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Advertising Standards Council of India(ASCI) రూపొందించిన కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినట్లే. చట్ట ప్రకారం ఇది నేరం. కేవలం లైసెన్స్ పొందిన యజమానులు మాత్రమే ఈ తరహా ఆఫర్లు ప్రకటించే వీలుంది. దేశంలో 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఆల్కహాల్ విక్రయించడం చట్ట విరుద్ధం.