ఇంటర్నెనెట్లో ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి ఎక్కువమంది వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్ (Google Chrome). పీసీల్లో అయినా, మొబైల్లో అయినా గూగుల్ క్రోమ్ వాడేందుకే ఎక్కువ మంది యూజర్లు ఇష్టపడుతున్నారంటే దానికున్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అందుకే తమ వినియోగదారుల సెక్యూరిటీకి గూగుల్ ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను తీసుకొస్తూనే ఉంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అందులో భాగంగా ఈ వారంలో క్రోమ్ మరో పెద్ద సెక్యూరిటీ అప్డేట్ను (Security update) రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త వెర్షన్ క్రోమ్‌కు అప్డేట్ కావడం ద్వారా వైరస్లు, బగ్‌లు, హ్యాకర్ల నుంచి మరింత భద్రత లభిస్తుంది. మ్యాక్, విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు మూడింటిలోనూ ఈ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గూగుల్‌కు అందిన సమాచారం ప్రకారం కొన్ని సైబర్ ఎటాక్‌లకు క్రోమ్‌లో అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని ఎదుర్కోవడానికి వీలుగా క్రోమ్ అప్డేటెడ్ వెర్షన్‌ని మన ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుతం యూజర్ల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం గూగుల్ పది అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఏకంగా ఆరు అప్డేట్లు హై సెక్యూరిటీకి సంబంధించినవిగా గూగుల్ చెబుతోంది.
ఈ సెక్యూరిటీ ప్యాచ్‌లను గూగుల్ త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ జులైలో క్రోమ్‌లో సెక్యూరిటీ థ్రెట్స్‌ను గుర్తించింది ఆండ్రాయిడ్. దీంతో కొత్త సెక్యూరిటీ అప్డేట్ను రిలీజ్ చేసింది గూగుల్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు క్రోమ్ వెర్షన్ 103.0.506.71 ప్యాచ్‌కు అప్డేట్ చేసుకోవాలని గూగుల్ అప్పట్లో కోరింది . (ప్రతీకాత్మక చిత్రం)
ఈ బగ్ ఎటాక్‌లు, హ్యాకింగ్ల నుంచి తప్పించుకోవడానికి గూగుల్ సాఫ్ట్వేర్ రిసెర్చర్ల నుంచి సాయం కోరుతోంది. బగ్ బౌంటీ రీసెర్చర్లు ఎవరైనా తమ ప్రొడక్ట్‌ల్లో సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా బగ్‌లను గుర్తిస్తే.. వెంటనే తమకు తెలియజేయాలని కోరుతోంది. అందుకు తగినట్లుగా వారికి మంచి రివార్డులు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)