స్మార్ట్‌ఫోన్(Smart Phones)లు ఆధునిక జీవితంలో అంతర్భాగంగా మారాయి. చాలా రకాల పనులు ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేవరకు ఫోన్‌తో అవసరాలు ముడిపడి ఉంటున్నాయి. అలాంటి స్మార్ట్‌ఫోన్‌ను సాధ్యమైనంత ఎక్కువ కాలం సజావుగా వినియోగించాలని అందరూ కోరుకుంటారు. వినియోగదారులు తమ ఫోన్ జీవితకాలాన్ని ప్రభావితం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం తెలుసుకోవాలి. ఏ పొరపాట్లకు కెప్ పెడితే ఎక్కువ కాలం ఫోన్‌ను వినియోగించవచ్చో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మరో ఛార్జర్‌ని ఉపయోగించడం
చాలా మంది వినియోగదారులు అన్ని ఛార్జర్లు ఒకేలా ఉంటాయనే అపోహతో ఉంటారు. ఫోన్లకు సెట్ అయ్యే కేబుల్ కనెక్టర్ వరకు ఏదైనా ఛార్జర్‌గా పని చేస్తుందని అనుకుంటారు. అయితే సరైన ఛార్జర్‌ని ఫోన్‌కు ఉపయోగించడం ముఖ్యం. తక్కువ ధరలో లభించే ఛార్జర్లకు దూరంగా ఉండాలి. వాటితో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇవి స్మార్ట్‌ఫోన్ లైఫ్‌ను దెబ్బతీస్తాయి. ఎల్లప్పుడూ మంచి బ్రాండ్‌కు చెందిన ఛార్జర్లను కొనుగోలు చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
Android OS, అప్డేట్స్ను డౌన్లోడ్ చేయకపోవడం
మొబైల్ బ్రాండ్లు క్రమం తప్పకుండా సాఫ్ట్వేర్ అలాగే మొబైల్ OS(Android) కోసం సెక్యూరిటీ అప్డేట్లను షేర్ చేస్తూ ఉంటాయి. ఫోన్‌కు కొత్త ఫీచర్లు, డిజైన్ ఎలిమెంట్లను తీసుకురావడంతో పాటు.. మరికొన్ని హానికరమైన యాప్‌ల నుంచి రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేయడంలో ఈ అప్డేట్స్ కీలకం. (ప్రతీకాత్మక చిత్రం)
ఫోన్లో పాత యాప్స్ ఉపయోగించడం
కొన్ని యాప్‌లకు సంబంధించి కొత్త అప్డేట్ అందుబాటులో ఉందని తెలిసినా కొందరు పట్టించుకోరు. ఈ అప్డేట్లు కొత్త ఫీచర్లతోపాటు.. అప్పటివరకు ఉన్న లోపాలు లేకుండా వస్తాయి. అప్డేట్ చేయకపోవడం ద్వారా పాత సమస్యలు కొనసాగుతాయి. వాటిని విస్మరించడం వల్ల ఫోన్లు మాల్వేర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జైల్ బ్రేకింగ్(Jailbreaking), రూటింగ్ ది డివైజ్(Rooting the device)
iOS లేదా Android ఫోన్లను జైల్బ్రేకింగ్ చేయడం, రూట్ చేయడం చట్టవిరుద్ధం కాదు. అయినప్పటికీ కంపెనీ అందించిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లపై రన్ అవుతున్న ఫోన్లకు మరింత సెక్యూరిటీ ఆప్షన్లు ఉంటాయి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలను యాక్సెస్ చేయకుండా వినియోగదారులను నియంత్రిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)