బ్లౌఫంక్ట్ 55 ఇంచుల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 59,999. అయితే దీన్ని ఇప్పుడు రూ. 39,999కే కొనొచ్చు. ఏకంగా రూ. 20 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 11 వేల వరకు ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద అదనంగా రూ. 1250 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఇవ్వన్నీ కలుపుకుంటే మీకు రూ. 27,749కే ఈ టీవీ లభిస్తుంది. ఇందులో 60 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి.
వన్ప్లస్ వై1ఎస్ ప్రో 55 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ టీవీపై కూడా సూపర్ డీల్ ఉంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 49,999. అయితే మీరు దీన్ని రూ. 39,999కు కొనొచ్చు. అంటే రూ.10 వేల డిస్కౌంట్ ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫర్ కింద రూ. 3 వేల వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 11 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే మీకు రూ. 25,999కే ఈ టీవీ లభిస్తుంది.
ఇంకా వీయూ గ్లో ఎల్ఈడీ 55 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ టీవీపై సూపర్ డీల్ ఉంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 65,000. అయితే దీన్ని ఇప్పుడు రూ. 36,999కు కొనొచ్చు. అంటే మీకు రూ. 28,001 తగ్గింపు వస్తోంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1250 తగ్గింపు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 16,900 వరకు వస్తుంది. అంటే మీకు ఈ టీవీ రూ. 18,849కే లభించినట్లు అవుతుంది. ఈ టీవీలో 104 వాట్ సబ్ఊఫర్ ఉంటుంది. అంటే అదిరిపోయే సౌండ్ వస్తుంది.
ఇంకా ఐఫాల్కన్ యూ62 55 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 73,990గా ఉంది. దీన్ని మీరు రూ. 28,999కే పొందొచ్చు. దీనిపై రూ. 44,991 తగ్గింపు వస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 11 వేల వరకు తగ్గింపు, బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1250 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మీకు ఈ టీవీ రూ. 17,849కే లభిస్తుందని చెప్పుకోవచ్చు.